ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. దసరా నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్

Siva Kodati |  
Published : Sep 15, 2023, 07:28 PM ISTUpdated : Sep 15, 2023, 08:25 PM IST
ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. దసరా నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దసరా రోజున ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దసరా రోజున ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అల్పాహారం అందించనున్నారు. 

పిల్లలకు విద్యా బోధనతో పాటు మంచి పోషకాహారం అందించే దిశగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉదయాన్ని పనులకు వెళ్లే తల్లిదండ్రులు విద్యార్ధులకు అల్పాహారాన్ని అందించడం కష్టంగా వున్నందున వారి ఇబ్బందులను కేసీఆర్ అర్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ స్కీమ్ వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.400 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. 

తమిళనాడులో అమలవుతున్న అల్పాహార పథకాన్ని స్పూర్తిగా తీసుకున్నారు కేసీఆర్. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులను అధ్యయనం నిమిత్తం అక్కడికి పంపారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారి స్మితా సభర్వాల్ ఇతర ఉన్నతాధికారులు చెన్నైలోని రాయపురంలోని వంటశాలను, అక్కడి ఆరత్తూన్ రోడ్డులోని ఉర్దూ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న అల్పాహారాన్ని రేచి చూశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి