ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స.. ధరల పట్టిక తప్పనిసరి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశం

By Siva KodatiFirst Published Jun 23, 2021, 3:32 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సల ధరలు విస్తృతంగా ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ధరల వివరాలను ఆసుపత్రి రిసెప్షన్, బిల్లింగ్ కౌంటర్ వద్ద ప్రదర్శించాలని చెప్పింది

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సల ధరలు విస్తృతంగా ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ధరల వివరాలను ఆసుపత్రి రిసెప్షన్, బిల్లింగ్ కౌంటర్ వద్ద ప్రదర్శించాలని చెప్పింది. అలాగే అధిక ఛార్జీలు వసూలు చేసే ఆసుపత్రులకు జరిమానా విధించాలని ఆదేశించింది హైకోర్టు. పది మంది చిన్నారులకు ఒకరిద్దరు అధికారులను నియమించాలని, అనాథ పిల్లలతో సన్నిహితంగా వుంటూ వారి అవసరాలను తీర్చాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Also Read:ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు ఫీజులు ఖరారు: జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్

కరోనా వేళ మహిళలపై గృహ హింస ఆందోళన కలిగిస్తోందన్న ధర్మాసనం.. డెల్టా వేరియెంట్ ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. ఎన్నికల విధుల్లో పాల్గోన్న 17 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు జూనియర్ లెక్చరర్లు కరోనాతో మరణించారని కోర్టుకు తెలిపింది విద్యాశాఖ. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు పీఎఫ్, ఇతర బెనిఫిట్లు త్వరగా అందేలా చూడాలని కోర్ట్ ఆదేశించింది. కరోనా పరిస్ధితులపై తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది కోర్ట్ 
 

click me!