తెలంగాణ భూముల అమ్మ‌కానికి నోటిఫికేష‌న్‌ ! త్వరలో జారీ...

Published : Jun 12, 2021, 01:51 PM IST
తెలంగాణ భూముల అమ్మ‌కానికి నోటిఫికేష‌న్‌ ! త్వరలో జారీ...

సారాంశం

హైద‌రాబాద్‌: నిధుల సమీకరణలో భాగంగా అత్యవసర ప్రజాపయోగ అవసరాల్లేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశమున్న ప్రభుత్వ భూములను అమ్మాలని సర్కారు నిర్ణయించిన విష‌యం తెలిసిందే. 

హైద‌రాబాద్‌: నిధుల సమీకరణలో భాగంగా అత్యవసర ప్రజాపయోగ అవసరాల్లేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశమున్న ప్రభుత్వ భూములను అమ్మాలని సర్కారు నిర్ణయించిన విష‌యం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో భూముల అమ్మ‌కానికి సంబంధించి ఈ నెల 15 న నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న‌ట్లు.. 25న ప్రీబిడ్ స‌మావేశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. జులై 13 రిజిస్ట్రేష‌న్ల‌కు చివ‌రి తేదీ అని 15వ తేదీ ఈ వేలం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించింది.

భూముల విక్ర‌యాల్లో భాగంగా కోకాపేట‌లో 49.95 ఎక‌రాలు, ఖానామెట్‌లోని 15.1 ఎక‌రాల‌ను ప్లాట్లుగా విక్ర‌యించ‌నున్నారు. కోకాపేట‌లోని భూముల‌ను హెచ్ఎండీఏ, ఖాన్‌మెట్‌లోని భూముల‌ను టీఎస్ఐఐసీ వేలం నిర్వ‌హించ‌నున్నాయి.

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే