అనధికార ప్లాట్స్, బిల్డింగ్‌ల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ సర్కార్ కొరడా

By Siva KodatiFirst Published Aug 26, 2020, 8:16 PM IST
Highlights

అనధికార ప్లాట్స్, బిల్డింగ్‌ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనధికార ప్లాట్స్, బిల్డింగ్‌‌ల రిజిస్ట్రేషన్స్‌పై నిషేధం విధిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆమోదించిన ప్లాన్ ప్రకారం నిర్మించిన భవనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది. ఏ మాత్రం నిబంధనలు ఉల్లంఘించినా రిజిస్ట్రేషన్ చేయకూడదని హెచ్చరించింది.

కొత్త మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అనుమతి ఉన్న లేఔట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని వెల్లడించింది.

మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు ఆమోదించిన ప్లాన్ ప్రకారం నిర్మించిన భవనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొంది. ఏ మాత్రం డివియేషన్ ఉన్నా రిజిస్ట్రేషన్ చేయకూడదని ప్రభుత్వం తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. 

click me!