పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్ వివాదం: యాక్షన్‌లోకి తెలంగాణ సర్కార్.. ఏపీపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు

Siva Kodati |  
Published : Jun 22, 2021, 07:51 PM ISTUpdated : Jun 22, 2021, 07:52 PM IST
పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్ వివాదం: యాక్షన్‌లోకి తెలంగాణ సర్కార్.. ఏపీపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు

సారాంశం

కృష్ణానదీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ సర్కార్ కృష్ణానదీ యాజమాన్య బోర్డకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లను నిలిపివేయాలని లేఖ రాశారు నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్

కృష్ణానదీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ సర్కార్ కృష్ణానదీ యాజమాన్య బోర్డకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లను నిలిపివేయాలని లేఖ రాశారు నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై ఫిర్యాదు చేసింది. ఎన్జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. 

కాగా, గత వారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఏపీ నిర్మిస్తోన్న పలు ప్రాజెక్ట్‌లపై తెలంగాణ కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కాల్వల నిర్మాణం సరైంది కాదని కేబినెట్ స్పష్టం చేసింది. ఈ అక్రమ ప్రాజెక్ట్‌లపై ఎన్జీటీ, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్రం ఆదేశించినా ఏపీ సర్కార్ ఖాతరు చేయడం లేదని.. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా వెళ్తామని కేబినెట్ స్పష్టం చేసింది. ఏపీ అక్రమ ప్రాజెక్ట్‌ల కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడింది. 

Also Read:జగన్‌కి కేసీఆర్ కౌంటర్: కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

కృష్ణానదిపై జోగులాంబ బ్యారేజ్ నిర్మాణం చేస్తామని తెలిపింది. 70 టీఎంసీల వరద నీటిని పైపుల ద్వారా తరలించేందుకు కేబినెట్ నిర్ణయించింది. పులిచింతల ఎడమ కాల్వ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రిమండలి తెలిపింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 20 టీఎంసీలకు నిల్వ సామర్థ్యం పెంచడంతో పాటు ఏపీ ప్రాజెక్ట్‌లపై పార్లమెంట్‌లో నిలదీస్తామని కేబినెట్ పేర్కొంది. ఏపీ ప్రాజెక్ట్‌లతో జరిగిన నష్టాన్ని ప్రజలు వివరిస్తామని వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu