కృష్ణా బేసిన్ ఆవలకు నీటి మళ్లింపు... కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

By Siva KodatiFirst Published Aug 28, 2021, 4:16 PM IST
Highlights

కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ రాశారు. హెచ్ఎన్‌ఎస్ఎస్ ప్రాజెక్ట్ నుంచి బేసిన్ ఆవలకు నీటి తరలింపు వల్ల బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్ట్‌లు నష్టపోతాయని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ  లేఖలో ప్రస్తావించారు. బేసిన్ ఆవల 700 కిలోమీటర్ల దూరంలో నీటిని తరలించడం అన్యాయమన్నారు

కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యూనల్ ప్రకారం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం మాత్రమేనన్నారు. దాని నుంచి కృష్ణా బేసిన్ ఆవలకు నీటి మళ్లింపును అనుమతించడం లేదని లేఖలో పేర్కొన్నారు. హెచ్ఎన్‌ఎస్ఎస్ ప్రాజెక్ట్ నుంచి బేసిన్ ఆవలకు నీటి తరలింపు వల్ల బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్ట్‌లు నష్టపోతాయని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ  లేఖలో ప్రస్తావించారు. బేసిన్ ఆవల 700 కిలోమీటర్ల దూరంలో నీటిని తరలించడం అన్యాయమన్నారు. హెచ్ఎన్‌ఎస్ఎస్ ప్రాజెక్ట్ ద్వారా టీబీహెచ్‌ఎల్‌సీ ప్రాజెక్ట్ కంటే ఆవలకు తీసుకెళ్లడం సరికాదని తెలంగాణ ఈఎన్‌సీ  అన్నారు. హెచ్‌ఎన్ఎస్ఎస్‌ను 3,850 క్యూసెక్కుల నుంచి 6,300లకు  పెంచడం అక్రమమని పేర్కొన్నారు. 

click me!