
భూముల అమ్మకం ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా దూసుకెళ్తొంది. ఇప్పటికే ఖానామెట్, కోకాపేట్ భూముల అమ్మకం ద్వారా వేల కోట్లు కళ్లజూసిన తెలంగాణ సర్కార్.. భూముల వేలానికి మరో దఫా సిద్ధమైంది. ఇందులో భాగంగా ఖానామెట్‌లో 22.79 ఎకరాలు, పుప్పాలగూడలో 94.56 ఎకరాలు, ఖానామెట్‌లో 9 ప్లాట్లు, పుప్పాలగూడలో 26 పాట్లు విక్రయించనుంది. మొత్తం 117.35 ఎకరాల విక్రయానికి సోమవారం టీఎస్‌ఐఐసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 27న ఖానామెట్, అదే నెల 29న పుప్పాలగూడ భూముల ఈ-వేలం నిర్వహించనున్నారు. తొలి దఫా నిర్వహించిన భూముల విక్రయంలో ఖానామెట్‌లో ఎకరం భూమి రూ.55 కోట్లు పలికిన విషయం తెలిసిందే.
Also Read:ముగిసిన ఖానామెట్ భూముల వేలం: కోకాపేట్ కంటే భారీ ధర.. ఎకరం రూ.55 కోట్లు పైమాటే