
హైదరాబాదు రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిన్న ఓ బాలుడు కనిపించకుండా పోవడం తెలిసిందే. ఆ బాలుడి అదృశ్యం కథ విషాదాంతం అయింది. ఆ చిన్నారి రాజేంద్రనగర్ సమీపంలోని ఓ చెరువులో శవమై తేలాడు. ఆడుకుంటూ వెళ్లి మళ్లీ ఇంటికి రాని తమ బిడ్డను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు అబ్దుల్ రహీమ్, తబస్సుమ్ కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ చిన్నారి ప్రమాదవశాత్తూ గుంతలో పటిపోయాడా లేక ఎవరైనా చంపేసి చెరువులో పడేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికులను సైతం విషాదానికి గురిచేసింది