తెలంగాణలో అన్నదాతలకు గుడ్‌న్యూస్ .. రైతు బంధు నిధుల విడుదలకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్, ఎప్పటి నుంచంటే..?

Siva Kodati |  
Published : Jun 19, 2023, 05:55 PM ISTUpdated : Jun 19, 2023, 05:57 PM IST
తెలంగాణలో అన్నదాతలకు గుడ్‌న్యూస్ .. రైతు బంధు నిధుల విడుదలకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్, ఎప్పటి నుంచంటే..?

సారాంశం

ఈ నెల 26 నుంచి తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు విడుదల కానున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతు బంధు నిధులను విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాలో నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే పోడు భూములకు పట్టాల పంపిణీ తర్వాత ఆ రైతులకు కూడా రైతు బంధు వర్తింపజేయాలని కేసీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

అంతకుముందు తుమ్మలూరులో హరితహారంలో భాగంగా మొక్కను నాటిన ముఖ్య‌మంత్రి కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలుతో తెలంగాణలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 276 కోట్ల మొక్కలు నాటామన్నారు. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామంలో నర్సరీ, ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనం, పిల్లల కోసం ఓపెన్ జిమ్ లు ఉండేలా అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో పెరిగిన పచ్చదనం సమిష్టి కృషి అన్నారు. 

ALso Read: అన్ని రంగాల్లోనూ అగ్ర‌స్థానంలో తెలంగాణ‌.. మ‌ళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే.. : సీఎం కేసీఆర్

తెలంగాణ‌లో మ‌రోసారి భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధికారంలోకి వ‌స్తుంద‌న్నారు. ఎన్నో ఉద్య‌మ పోరాటాల‌తో సాధించుకున్న రాష్ట్రం నేడు దేశంలోనే అనేక రంగాలు, వివిధ సూచీక‌ల్లో అగ్ర‌స్థానంలో ముందుకు సాగుతున్న‌ద‌ని తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ అన్నారు. గ్రీన్ డ్రైవ్ లో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎ.శాంతికుమారి)ని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల ఆల‌స్యంపై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఖండించారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించి కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు ప‌నుల‌పై స్టే పొందడం వల్లే రాష్ట్రంలో పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యమైందని ఆరోపించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వరలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్ నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణను అపహాస్యం చేసిన వారు, వ్యవసాయం ఎలా చేయాలో తెలియదన్నారు. వారు ఇప్పుడు ఏడో స్థానంలో ఉన్నారనీ, తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయం, వరి ఉత్పత్తి, 24×7 విద్యుత్ సరఫరా తదితర సూచీల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Prices : నిమ్మ ధర వింటే వామ్మో అనాల్సిందే... హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంత?
CM Revanth Reddy Ramp Walk At Nakirekal Meeting | Asianet News Telugu