మార్చి 1 నుంచి సామాన్యులకూ వ్యాక్సిన్: ఏర్పాట్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్

By Siva KodatiFirst Published Feb 25, 2021, 4:06 PM IST
Highlights

మార్చి 1 నుంచి 60 ఏళ్ల  పై బడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. పెద్దలకు వ్యాక్సిన్ పంపిణీపై విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన ప్రకటించారు.

మార్చి 1 నుంచి 60 ఏళ్ల  పై బడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. పెద్దలకు వ్యాక్సిన్ పంపిణీపై విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన ప్రకటించారు.

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1500 సెంటర్లలో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని శ్రీనివాస్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో రిజిస్ట్రర్ చేయించుకోవాలని హెల్త్ డైరెక్టర్ ప్రజలకు సూచించారు.

ప్రైవేట్ వ్యాక్సిన్ ధర కేంద్రం నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, మార్చి 1వ తేదీ నుంచి సామాన్యులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీని ప్రకారం 60 ఏళ్లు పైబడిన వాళ్లతో పాటు.. వివిధ వ్యాధులతో బాధపడుతోన్న 45 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

Also Read:ఇక సామాన్యులకూ కోవిడ్ వ్యాక్సిన్.. మార్చి 1 నుంచి అమలు

జనవరి 16వ తేదీన ప్రారంభమైన వ్యాక్సినేషన్.. తొలి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా ఇచ్చారు.. ముందుగా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు.. ఇలా వ్యాక్సినేషన్ జరుగుతోంది.

నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1.17 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక, తాజా నిర్ణయంతో మార్చి 1వ తేదీ నుంచి సామాన్యులకు కూడా వ్యాక్సినేషన్ జరగబోతోంది. 

click me!