టీఆర్ఎస్ ఎంపీ బి.బి పాటిల్ కు ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్

Arun Kumar P   | Asianet News
Published : Feb 25, 2021, 02:01 PM ISTUpdated : Feb 25, 2021, 02:11 PM IST
టీఆర్ఎస్ ఎంపీ బి.బి పాటిల్ కు ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్

సారాంశం

దేశ వ్యాప్తంగా 25 మంది ఎంపీలను ఉత్తమ పార్లమెంటీయన్ లుగా ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల నుండి జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ ఒక్కరే ఈ అవార్డు కు ఎంపికయ్యారు. 

 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్ ను ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరం ఉత్తమ పార్లమెంటీరియన్ గా గుర్తించింది. ఈ అవార్డుకు దేశ వ్యాప్తంగా 25 మంది ఎంపీలు ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల నుండి జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ ఒక్కరే ఈ అవార్డు కు ఎంపికయ్యారు. 

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఎంపీ బి.బి పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి వేముల ఎంపి బి.బి పాటిల్ ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తమ పార్లమెంటీరియన్ గా గుర్తించిన ఫేమ్ ఇండియా మ్యాగజైన్ వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

నూతన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తరపున పోటీచేసి జహిరాబాద్ ఎంపీగా గెలిచారు బిబి పాటిల్. తనపై నమ్మకంతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై పార్లమెంట్ లో పోరాడుతున్నారు.  దీంతో ఇప్పటికే జహిరాబాద్ పరిధిలో పలు సమస్యలను కూడా పరిష్కరించి ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ఆయన పనితీరుకు దక్కిన గౌరవమే ఈ  ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరం ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డు. 
 


 

PREV
click me!

Recommended Stories

Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu