తెలంగాణ ఉద్యోగులకు చేదువార్త: ఈ నెల కూడా పాత జీతాలే, కారణమిదే..!

By Siva KodatiFirst Published Apr 22, 2021, 5:51 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా పాత నెల జీతాలే రానున్నాయి. పీఆర్‌సీ ఫైల్ ఇంకా సీఎంవోలో వుండటంతో ఏప్రిల్‌లో కొత్త పీఆర్‌సీ జీతాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఆ ఫైల్ ఫైనాన్స్ శాఖకు వచ్చిన తర్వాత పీఆర్‌సీ ఉత్తర్వులు జారీ అవుతాయి. 

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా పాత నెల జీతాలే రానున్నాయి. పీఆర్‌సీ ఫైల్ ఇంకా సీఎంవోలో వుండటంతో ఏప్రిల్‌లో కొత్త పీఆర్‌సీ జీతాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు.

ఆ ఫైల్ ఫైనాన్స్ శాఖకు వచ్చిన తర్వాత పీఆర్‌సీ ఉత్తర్వులు జారీ అవుతాయి. అధికారిక ఉత్తర్వులు జారీ అయిన తర్వాత లెక్కలు పూర్తయ్యేందుకు వారం రోజుల సమయం పడుతుందని ఆర్ధిక శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఏప్రిల్ నెలలో పెరగాల్సిన జీతం.. మేతో కలిపి ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. 

Also Read:పీఆర్‌సీ రగడ: ఆంధ్రా కంటే ఎక్కువే ఇస్తా... ఉద్యోగులకు కేసీఆర్ హామీ

జీఓలు జారీ చేశాక . ట్రెజరీ లకు గైడ్ లైన్స్ ఇవ్వాలని డీడీవోలు అందరి వ్యక్తిగత శాలరీ ఫిక్సేషన్ చేయాలి.... అప్రూవల్ కోసం ట్రెజరీలకు పంపించాలి... ట్రెజరీ నుంచి అప్రూవల్ రాగానే డీడీవోలు బిల్స్ పంపించాలని తెలుస్తోంది.

అంటే ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి టైం పడుతుందని ఏదయినా అద్భుతం జరిగితే తప్ప ఈ నెల కొత్త జీతాలు పడటం కష్టమేనని సెక్రటేరియట్ వర్గాలు అంటున్న్నాయి. మే నెల జీతంతో పాటు ఏప్రిల్ నెల డ్యూ లు కలిపి జూన్ ఒకటి పడే జీతంతో కలిసి వేసే అవకాశం ఉందని అంటున్నారు.
 

click me!