కేరళకు తెలంగాణ ప్రభుత్వం మరో సాయం

By ramya neerukondaFirst Published Aug 22, 2018, 2:40 PM IST
Highlights

 ఇప్పటికే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  రూ.25కోట్లు ఆర్థిక సహాయం అందించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణ ఐఏఎస్ అధికారులందరూ తమ ఒక రోజు జీతాన్ని కూడా అందిస్తున్నట్లు ప్రకటించారు.
 

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి మరో సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పటికే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  రూ.25కోట్లు ఆర్థిక సహాయం అందించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణ ఐఏఎస్ అధికారులందరూ తమ ఒక రోజు జీతాన్ని కూడా అందిస్తున్నట్లు ప్రకటించారు.

తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం నుంచి మరో సహాయం అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేరళకు పంపింది.  పీపుల్స్ ప్లాజాలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ లు బియ్యం లారీలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

18లారీలు పీపుల్ ప్లాజా నుంచి బయలుదేరగా.. మరో 6లారీలు వివిధ జిల్లాల నుంచి కేరళకు బయలుదేరాయి. ఈ బియ్యాన్ని కేరళ ప్రభుత్వ సూచనల మేరకు కొచ్చి, ఎర్నాకులంకు సమీపంలోని ఎడతల టౌన్ లో ఉన్న సీడబ్ల్యూసీ గోదాముల్లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం ఈ లారీలు ప్రారంభంకాగా.. 18గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటాయని అధికారులు వివరించారు.
 

click me!