విషాదం: మూడంతస్థుల నుండి పడి చిన్నారి మృతి, కాపాడుతూ మరొకరి మరణం

Published : Aug 22, 2018, 01:29 PM ISTUpdated : Sep 09, 2018, 01:43 PM IST
విషాదం: మూడంతస్థుల నుండి పడి చిన్నారి మృతి, కాపాడుతూ మరొకరి మరణం

సారాంశం

:సికింద్రాబాద్‌లోని  రైల్వేకాలనీలో  బుధవారం  నాడు   ఉదయం  మూడంతస్తుల భవనం నుండి  ఇద్దరు చిన్నారులు పడి  మృత్యువాత పడ్డారు.  18 మాసాల చిన్నారిని  మూడంతస్తుల భవనం నుండి  కింద పడకుండా కాపాడే ప్రయత్నంలో పల్లవి అనే బాలిక కూడ కిందపడి మృత్యువాత పడింది.

హైదరాబాద్:సికింద్రాబాద్‌లోని  రైల్వేకాలనీలో  బుధవారం  నాడు   ఉదయం  మూడంతస్తుల భవనం నుండి  ఇద్దరు చిన్నారులు పడి  మృత్యువాత పడ్డారు.  18 మాసాల చిన్నారిని  మూడంతస్తుల భవనం నుండి  కింద పడకుండా కాపాడే ప్రయత్నంలో పల్లవి అనే బాలిక కూడ కిందపడి మృత్యువాత పడింది.

సికింద్రాబాద్ రైల్వే కాలనీలోని మూడో అంతస్తు భవనం నుండి  18 నెలల చిన్నారి శ్రేయ కిందపడబోతోంటే అక్కడే ఉన్న  ఏడేళ్ల  పల్లవి రక్షించేందుకు ప్రయత్నించింది.

మూడంతస్థుల భవనం నుండి చిన్నారి శ్రేయను కిందపడకుండా పల్లవి కొద్దిసేపు కాపాడింది. అయితే చిన్నారి శ్రేయ టీ షర్ట్ చిరిగిపోవడంతో  మూడంతస్తుల భవనం నుండి  కిందపడింది. మరో వైపు చిన్నారి శ్రేయను కాపాడే క్రమంలో  భవనంపై పట్టును కోల్పోయిన  పల్లవి కూడ భవనం నుండి కిందపడింది.

అయితే ఈ పిల్లలిద్దరూ కూడ భవనం నుండి కింద పడుతుండగా చూసిన మరో మహిళ వారిద్దరిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.  ఇద్దరూ  చిన్నారులు కూడ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన  స్థానికంగా విషాదాన్ని నింపింది.

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?