Police Medals: ప్రతియేటా విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ పతకాలు ప్రకటించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సోమవారం నాడు పోలీస్ పతకాలు ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
Police Medals: నూతన సంవత్సర వేడుకల వేళ విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగానే తెలంగాణ సర్కార్ అత్యుత్తమ సేవలందించే పోలీస్ అధికారులకు గత కొన్నేళ్లుగా ఈ అవార్డులను అందిస్తుంది. సోమవారం ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర శౌర్య పతకానికి కే ఉపేందర్ (JC 4528 గ్రేహౌండ్స్)ను ఎంపిక చేశారు.
మహోన్నత సేవా పతకానికి మంద నవీన్ (సబ్ ఇన్‌స్పెక్టర్- రాచకొండ), వేలేటి మనోహర్ రావు (సబ్ ఇన్‌స్పెక్టర్- రాచకొండ), ఎం షడ్రక్ (SIT-హైదరాబాద్), గజాడి మల్లేశం (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్- సైబరాబాద్)ఎంపికయ్యారు. ఇక ఉత్తమ సేవా పతకానికి సయ్యద్ నయీముద్దీన్ జావీద్ (ఏసీపీ రోడ్ సేఫ్టీ -రాచకొండ), జీ రణ్‌వీర్ రెడ్డి (ఏసీపీ -మాదాపూర్ ట్రాఫిక్), ఎస్ శ్రీనివాసులు (ఏసీపీ -బాలానగర్ ట్రాఫిక్) ఎంపికయ్యారు.