టీఆర్ఎస్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నం చేశారని తెలంగాణ రాష్ట్ర పౌరసరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
కరీంనగర్: టీఆర్ఎస్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నం చేశారని తెలంగాణ రాష్ట్ర పౌరసరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.ఆదివారం నాడు ఆయన కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఈటల రాజేందర్ మీద వ్యక్తిగతంగా కోపం లేదన్నారు.ఎదుటి వాళ్లు సంబరపడితే ఈర్ష్యపడే వ్యక్తి ఈటల అని ఆయన చెప్పారు.
also read:టీఆర్ఎస్ షాక్... ఈటలకు మద్దతుగా భారీగా ఉప సర్పంచుల రాజీనామా
ఆత్మగౌరవం ఉంటే నల్లచట్టాలు చేసిన కేంద్రాన్ని ప్రశ్నించాలని ఆయన ఈటలకు సూచించారు.హుజూరాబాద్ అభివృద్ది కావాలంటే టీఆర్ఎస్ మరోసారి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ బొమ్మతోనే ఈటల రాజేందర్ గెలిచారని ఆయన గుర్తు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ ఈ నెల 12న రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ స్థానం ఖాళీ అయినట్టుగా స్పీకర్ కార్యాలయం ఈసీకి సమాచారం పంపింది. ఈ నెల 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు.