భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను నిఖిత్ జరీన్ తండ్రికి తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.
భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్‌లో 600 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్రీడా శాఖ తరఫున నిఖిత్ జరీన్‌కు ఈ ఇంటి స్థలం కేటాయించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను నిఖిత్ జరీన్ తండ్రికి తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. త్వరలోనే నిఖిత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.
ఇక, నిజామాబాద్ జిల్లాకు చెందిన జరీన్ బాక్సర్‌గా తన అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలను సొంతం చేసుకుంటుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచింది. గతేడాది మే 19న 52 కిలోల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌ను ఓడించిన జరీన్ ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలోనే అప్పుడే నిఖత్ జరీన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇంటి స్థలం కూడా కేటాయించనున్నట్టుగా ప్రకటించింది.
గతేడాది తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ రూ. 2 కోట్ల నగదు చెక్కును అందజేశారు. అయితే తాజాగా నిఖత్ జరీన్‌కు 600 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం అందజేసింది.