మా పార్టీని అపహస్యం చేస్తున్నారు: బీఆర్ఎస్‌పై కూనంనేని ఫైర్

Published : Feb 20, 2023, 04:43 PM IST
 మా పార్టీని అపహస్యం  చేస్తున్నారు: బీఆర్ఎస్‌పై కూనంనేని  ఫైర్

సారాంశం

పొత్తుల విషయంలో  తమ పార్టీని చులకన చేసి మాట్లాడడంపై  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు బీఆర్ఎస్‌పై  ఆగ్రహం వ్యక్తం  చేశారు.  

ఖమ్మం:తమ  పార్టీ గురించి  అవహేళన  చేసే వారిని  బీఆర్ఎస్  నేతలను   కేసీఆర్   కంట్రోల్  చేయాలని  సీపీఐ  తెలంగాణ   రాష్ట్ర  సమితి  కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు  కోరారు. సోమవారం నాడు  భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలో  కూనంనేని సాంబశివరావు  మీడియాతో మాట్లాడారు.  కొందరు  బీఆర్ఎస్ నేతలు  ఉద్దేశ్యపూర్వకంగా  తమ  పార్టీని  అవహేళన  చేస్తున్నారని  ఆయన  ఆగ్రహం  వ్యక్తం  చేశారు. సీపీఐ  గురించి  బీఆర్ఎస్  పాఠాలు  చెప్పాల్సిన  అవసరం లేదన్నారు.  పినపాకలో  ఐదుసార్లు  సీపీఐ అభ్యర్ధులు విజయం సాధించారని  ఆయన  గుర్తు  చేశారు.  ఎన్నికల నాటికి  తమ పార్టీని మరింత  బలోపేతం   చేస్తామన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?