
హైదరాబాద్: పుడింగ్ మింక్ పబ్ కేసులో నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో Banjara Hills పోలీసులు సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.
ఆదివారం నాడు తెల్లవారుజామున బంజారాహిల్స్ లో ఉన్న Puddign Mink పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో పబ్ లో Drugs ను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో Anil Kumar,. అభిషేక్ ఉప్పల్ లను పోలీసులు Nampally కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఈ ఇద్దరికి 14 రోజుల రిమాండ్ ను విధించింది కోర్టు. ఈ ఇద్దరు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో Custody Petition దాఖలు చేశారు.
డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు ఆ పిటిషన్ లో కోరారు. డ్రగ్స్ ఎవరికి సరఫరా చేశారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ ఇద్దరు నిందితులను ఈ విషయాలపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కారణంతోనే నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేయనుంది.
బంజారాహిల్స్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరు గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో పట్టుబడినవారిని విచారణ అనంతరం పోలీసులు వదిలిపెట్టారు. దాడి సమయంలో పబ్‌లో సిబ్బందితో సహా 148 మంది ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. పబ్‌లో జరిగిన లేట్ నైట్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు బంధువులు, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు.
ఈ పబ్ లో దొరికిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పోలీసులు వదిలేశారు.ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. శివచంద్ర స్థానంలో టాస్క్ ఫోర్స్ సీఐగా ఉన్న నాగేశ్వరరావును నియమించారు. ఈ పబ్ లోకి వచ్చిన వారికి కోడ్ భాషలో డ్రగ్స్ సరఫరా చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.