Women’s Reservation Bill: మహిళా బిల్లుకు కేబినెట్ ఆమోదం.. చారిత్రాత్మ‌క నిర్ణ‌యం : గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

Published : Sep 19, 2023, 10:10 AM IST
Women’s Reservation Bill: మహిళా బిల్లుకు కేబినెట్ ఆమోదం.. చారిత్రాత్మ‌క నిర్ణ‌యం : గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

సారాంశం

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి సమావేశం అనంతరం కేంద్ర కేబినెట్ ఆదే రోజు సాయంత్రం సమావేశమైంది. రాబోయే రోజుల్లో మహిళా భాగస్వాములను పార్లమెంటుకు తీసుకురావాలని పలువురు బీజేపీ మంత్రులు, ఎంపిలను కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లకు హామీ ఇచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని గ‌త కొంత‌కాలంగా పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన హైదరాబాద్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ దీనిపై తీర్మానం చేశారు.  

Telangana Governor Tamilisai Soundararajan: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. ఐదు రోజుల పాటు జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి సమావేశం అనంతరం కేంద్ర కేబినెట్ ఆదే రోజు సాయంత్రం సమావేశమైంది. రాబోయే రోజుల్లో మహిళా భాగస్వాములను పార్లమెంటుకు తీసుకురావాలని పలువురు బీజేపీ మంత్రులు, ఎంపిలను కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లకు హామీ ఇచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని గ‌త కొంత‌కాలంగా పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన హైదరాబాద్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ దీనిపై తీర్మానం చేశారు.

ఈ క్ర‌మంలోనే స్పందించిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కేంద్ర నిర్ణ‌యం పై హ‌ర్షం వ్య‌క్తంచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇది చారిత్రక నిర్ణయమ‌ని పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యంతో మరింత మంది మహిళలను ప్రజా జీవితంలోకి వచ్చేలా ప్రోత్సహిస్తుందనీ, ఇది సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

కాగా, పార్లమెంట్‌, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించడంపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. "చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈరోజు క్యాబినెట్‌లో ఆమోదం లభించింది" అని ఆమె Xలో పోస్ట్ చేసింది. దీనిని చారిత్రక క్షణంగా పేర్కొంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత తన అవిశ్రాంతంగా కృషి చేసినందుకు ఆమె తన హృదయపూర్వక అభినందనలను తెలియజేసింది. కాగా, గ‌త కొంత‌కాలంగా క‌విత మ‌హిళా బిల్లుకోసం పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌మావేశాల‌కు ముందు కూడా ఆమె దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కు లేఖ రాశారు. దేశ‌రాజ‌ధానిలో ప‌లుమార్లు నిర‌స‌న కూడా చేప‌ట్టారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?