మీర్‌పేట్‌‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. తమిళిసై దిగ్భ్రాంతి, నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎస్ , డీజీపీలకు ఆదేశం

Siva Kodati |  
Published : Aug 22, 2023, 03:12 PM IST
మీర్‌పేట్‌‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. తమిళిసై దిగ్భ్రాంతి, నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎస్ , డీజీపీలకు ఆదేశం

సారాంశం

హైదరాబాద్‌ మీర్‌పేట‌లో బాలికపై గ్యాంగ్‌రేప్‌ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, రాచకొండ సీపీకి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.  

హైదరాబాద్‌ మీర్‌పేట‌లో బాలికపై గ్యాంగ్‌రేప్‌ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, రాచకొండ సీపీకి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. మీర్ పేట బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని ఎల్ బీ నగర్  డీసీపీ సాయిశ్రీ చెప్పారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... మీర్ పేట ఘటనకు సంబంధించి  అన్ని కోణాల్లో దర్యాప్తు  చేస్తున్నామన్నారు. బాలికపై ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని  ఆమె చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్ట్  చేసేందుకు ఏడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా  డీసీపీ చెప్పారు. నిందితులకు సంబంధించిన కొన్ని  ఆధారాలు లభించాయన్నారు. ఈ ఆధారాలతో  నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బాధితురాలు క్షేమంగా ఉందని  ఆమె వివరించారు. 

ALso Read: హైద్రాబాద్ మీర్ పేట గ్యాంగ్ రేప్: ముగ్గురు నిందితుల కోసం గాలింపు

మీర్ పేటలో బాధితురాలి ఇంటికి వెళ్లి  సోదరుడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు సోదరులతో కలిసి మీర్ పేట నందనవనంలో ఉంటుంది. బాధితురాలి తండ్రి మరో వివాహం చేసుకోవడంతో  తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో  బాధితురాలు సోదరులతో కలిసి నందనవనంలోని ఇంట్లో నివాసం ఉంటుంది.  ఈ విషయాన్ని గుర్తించిన  నిందితులు ఉదయం పూటే  ఇంట్లోకి వచ్చి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.బాధితురాలు ఈ విషయమై  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ  ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ నేతలు  ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో  ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్  చేశారు.


 

PREV
click me!

Recommended Stories

సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech