భద్రాచలం ఆలయంలో గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు

By narsimha lode  |  First Published May 17, 2023, 11:40 AM IST

తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందరరాజన్   ఇవాళ  భద్రాచలం  జిల్లాలో  టూర్ నిర్వహించారు.  భద్రాలచం  ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


భద్రాచలం: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  బుధవారంనాడు  భద్రాచలం  ఆలయంలో  ప్రత్యేక  పూజలు నిర్వహించారు. జిల్లాలో  నిర్వహించే  పలు  సామాజిక కార్యక్రమాల్లో  పాల్గొనేందుకు  గవర్నర్  ఇవాళ భద్రాచలం  జిల్లాకు  చేరుకున్నారు. భద్రాచలం చేరుకున్న తర్వాత  తొలుత  గవర్నర్  సీతారామచంద్రస్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు, అధికారులు  గవర్నర్ కు  స్వాగతం పలికారు.అనంతరం  గవర్నర్  ఆలయంలో  పూజలు  నిర్వహించారు.  వేద పండితులు  గవర్నర్ ను  ఆశీర్వదించారు.  అనంతరం  స్వామివారి  తీర్ధప్రసాదాలు అందించారు.అనంతరం  భద్రాచలం సమీపంలో  గిరిజనులతో  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  సమావేశమయ్యారు.  గిరిజనులతో  కలిసి  సంప్రదాయ నృత్యం చేశారు. 

Latest Videos

ఈ సందర్భంగా  భద్రాచలంలో  నిర్వహించిన  కార్యక్రమంలో  గవర్నర్  తమిళిసై సౌందరరాజన్  పాల్గొన్నారు.ఆదీవాసీలు  పౌష్టికాహరం లేక  ప్రజలు  బలహీనులుగా మారుతున్నారు.  ప్రభుత్వాలు ప్రత్యేక  చర్యలు చేపట్టినా కూడా ఆదీవాసీల్లో  అభివృద్ది లేదన్నారు. ఆదీవాసీల వెనుకబాటుతనానికి  కారణాలు తెలుసుకోవాల్సిన  అవసరం ఉందని  గవర్నర్  చెప్పారు. అసమానతలు తొలగించేందుకు  ప్రతి ఒక్కరూ  నడుంబిగించాలని  గవర్నర్ కోరారు.ఆదీవాసీల  అభివృద్దికి  తన  వంతు  కృషి  చేస్తానని  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు.

click me!