కేసీఆర్‌ బర్త్ డే: శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై

By narsimha lode  |  First Published Feb 17, 2023, 9:24 AM IST


తెలంగాణ సీఎం  కేసీఆర్ కి  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  బర్త్ డే విషెస్  చెప్పారు.  


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కి  తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందరరాజన్  శుక్రవారం నాడు  పుట్టిన రోజు శుభాకాంక్షలు  తెలిపారు.  ట్విట్టర్ వేదికగా  గవర్నర్  తమిళిసై సౌందర రాజన్  సీఎం కేసీఆర్  కి  బర్త్‌డే విషెష్ చెప్పారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో  కేసీఆర్ కి  గవర్నర్ గ్రీటింగ్స్ తెలిపారు.  

గత  ఏడాది తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందరరాజన్  పుట్టిన  రోజున  తెలంగాణ సీఎం కేసీఆర్  శుభాకాంక్షలు తెలిపారు.  గవర్నర్ కు  బర్త్ డే విషెష్ తెలుపుతూ  కేసీఆర్  లేఖ రాశారు.  ప్రగతి భవన్ , రాజ్ భవన్ మధ్య  గత నెలలో   సయోధ్య కుదిరింది.   ఈ నేపథ్యంలో  తెలంగాణ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్  తమిళిసై సౌందర రాజన్  ప్రారంభించారు.

Latest Videos

బడ్జెట్  కు తెలంగాణ గవర్నర్  ఆమోదం తెలపడం లేదని  తెలంగాణ ప్రభుత్వం  హైకోర్టులో గత నెల చివర్లో   లంచ్ మోషన్   పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ పిటిషన్ విచారణ సమయంలో   హైకోర్టు సూచన మేరకు  ఇరు వర్గాల న్యాయవాదులు  చర్చించారు.  రాజ్ భవన్,  ప్రగతి భవన్ మధ్య  సయోధ్యలో కీలకంగా  వ్యవహరించారు.  రాజ్యాంగబద్దంగా  వ్యవహరిస్తామని  ప్రభుత్వ తరపు  న్యాయవాది  హమీ ఇచ్చారు.  గవర్నర్ పై  విమర్శలు  మానుకోవాలని  గవర్నర్  తరపు న్యాయవాది  చేసిన సూచనకు ప్రభుత్వ  న్యాయవాది అంగీకరించారు. తమ  మధ్య  సయోధ్య  కుదిరిన విషయాన్ని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. లంచ్ మోషన్ పిటిషన్ ను  వెనక్కి తీసుకొంది  తెలంగాణ ప్రభుత్వం.

 

Birthday Wishes to honb
Shri K Chandrasekar Rao garu

— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv)

ఈ నెల 3వ తేదీన  తెలంగాణ అసెంబ్లీ  సమావేశాలను  గవర్నర్  తమిళిసై ప్రారంభించారు.    బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు  వచ్చిన గవర్నర్ ను  కేసీఆర్ సాదరంగా  ఆహ్వానించారు.  ఇవాళ కేసీఆర్ పుట్టిన  రోజును పురస్కరించుకొని   గవర్నర్  తమిళిసై సౌందరరాజన్  ట్విట్టర్ వేదికగా  గ్రీటింగ్స్ తెలిపారు.

tags
click me!