తెలంగాణలో వైస్ ఛాన్సలర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 10 మంది వీసీలు

By Siva KodatiFirst Published May 21, 2021, 8:28 PM IST
Highlights

తెలంగాణలో 10 మంది కొత్త వైస్ ఛాన్సెలర్ల నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలో వైస్ ఛాన్సెలర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. 

రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, జేఎన్టీయూహెచ్‌, శాతవాహన, అంబేద్కర్‌, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయం వర్సిటీలకు కొత్త వీసీలు రానున్నారు. 2019 జూన్‌ నుంచి వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలుగా ఐఏఎస్‌ అధికారులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
 
జేఎన్టీయూ : కట్టా నరసింహారెడ్డి
కాకతీయ యూనివర్సిటీ: తాటికొండ రమేశ్
ఉస్మానియా: రవీందర్ యాదవ్
మహాత్మా గాంధీ యూనివర్సిటీ: గోపాల్ రెడ్డి
శాతవాహన యూనివర్సిటీ: ప్రొ. మల్లేశ్
తెలంగాణ యూనివర్సిటీ: రవీందర్ గుప్తా
పాలమూరు యూనివర్సిటీ: రాథోడ్
అంబేద్కర్ యూనివర్సిటీ: సీతారామారావు
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ: కిషన్ రావు
ఆర్జీయూకేటీ యూనివర్సిటీ: గోవర్థన్

click me!