కరోనాపై సమీక్ష: గవర్నర్ తమిళసైకి తెలంగాణ అధికారులు షాక్

Published : Jul 06, 2020, 07:11 PM IST
కరోనాపై సమీక్ష: గవర్నర్ తమిళసైకి తెలంగాణ అధికారులు షాక్

సారాంశం

రాష్ట్రంలో కరోనా కేసులపై సమీక్ష నిర్వహించాలని గవర్నర్ తమిళిసై భావించారు. అయితే గవర్నర్ కి అధికారులు షాకిచ్చారు. దీంతో ఇవాళ కాకుండా మంగళవారం నాడు కరోనాపై గవర్నర్ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

హైదరాబాద్:రాష్ట్రంలో కరోనా కేసులపై సమీక్ష నిర్వహించాలని గవర్నర్ తమిళిసై భావించారు. అయితే గవర్నర్ కి అధికారులు షాకిచ్చారు. దీంతో ఇవాళ కాకుండా మంగళవారం నాడు కరోనాపై గవర్నర్ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

 

కరోనా కేసులపై సమీక్ష నిర్వహించేందుకుగాను సోమవారం నాడు  సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్ కు రావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, హెల్త్ సెక్రటరీకి గవర్నర్ సమాచారం పంపారు.  

also read:కౌన్సిలర్ కే దిక్కులేదు, ఆస్పత్రులన్నీ తిరిగి మరణించింది: జగ్గారెడ్డి

అయితే ముందుగానే నిర్ధేశించుకొన్న సమావేశాల వల్ల ఈ సమావేశానికి రాలేమని అధికారులు గవర్నర్ కు పంపారు. దీంతో మంగళవారం నాడు అధికారులతో కరోనాపై సమీక్ష నిర్వహించాలని గవర్నర్ భావిస్తున్నారు.మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు.

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఆదివారం నాడు కరోనా కేసులు 23,920కి చేరుకొన్నాయి. ఆదివారం నాడు ఒక్క రోజే 1590 కేసులు నమోదయ్యాయి.జీహెచ్ఎంసీ పరిధిలోనే 1277 కేసులు రికార్డయ్యాయి. దేశంలోని కరోనా కేసుల నమోదులో రాష్ట్రం ఆరో స్థానానికి చేరుకొంది.


 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?