తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం: చెన్నైకి భౌతికి కాయం

Published : Aug 18, 2021, 08:16 AM ISTUpdated : Aug 18, 2021, 09:02 AM IST
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం: చెన్నైకి భౌతికి కాయం

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై మాతృమూర్తి కృష్ణ కుమారి హైదరాబాదులో బుధవ ారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణకుమారి భౌతిక కాయాన్ని తమిళనాడు రాజధాని చెన్నైకి తరలించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై మాతృమూర్తి కృష్ణకుమారి కన్నుమూశారు. హైదరాబాదులో బుధవారం తెల్లవారు జామున ఆమె కన్నుముశారు. ఆమె భౌతిక కాయాన్ని తమిళనాడు రాజధాని చెన్నైకి తరలిస్తారు. ఆమె వయస్సు 7 ఏళ్లు.

కృష్ణకుమారికి తమిళిసై పెద్ద కూతురు. కృష్ణకుమారి మాజీ పార్లమెంటు సభ్యుడు కుమారినందన్ భార్య. కృష్ణకుమారి మంగళవారంనాడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను హైదరాబాదుులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమెను వెంటిలేటర్ మీద ఉంచారు.చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

తమిళిసై తల్లి కృష్ణకుమారి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. తమిళిసై కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై తల్లి కృష్ణకుమారి మృతి పట్ల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తమిళిసై కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్ణకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ