
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్ కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్ సీఏ ఉపాధ్యక్షుడు కె. జాన్ మనోజ్ తో పాటు.. పలువురు ఎగ్జిక్యూటివ్ సభ్యులను సస్పెండ్ చేస్తూ హెచ్ సీఏ అంబుడ్స్ మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ వర్మ గత నెల జులై 4న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ షమీమ్ అఖ్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. త్వరలో ఈ పిటిషన్ సింగిల్ జడ్జి ముందుకు విచారణకు రానున్న నేపథ్యంలో అప్పటివరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని సూచించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అజారుద్దీన్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు.