న్యాయపరమైన అంశాలు పరిశీలించాకే నిర్ణయం: టీఎస్ఆర్టీసీ బిల్లుపై రాజ్ భవన్ వర్గాలు

Published : Aug 04, 2023, 03:15 PM ISTUpdated : Aug 04, 2023, 03:25 PM IST
న్యాయపరమైన అంశాలు పరిశీలించాకే నిర్ణయం: టీఎస్ఆర్టీసీ బిల్లుపై రాజ్ భవన్ వర్గాలు

సారాంశం

టీఎస్ఆర్టీసీ బిల్లుపై  న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని గవర్నర్  కార్యాలయం వివరించింది. బుధవారంనాడు మధ్యాహ్నం ఈ బిల్లు రాజ్ భవన్ కు చేరిందని రాజ్ భవన్ ప్రకటించింది.  

హైదరాబాద్: న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తర్వాతే టీఎస్ఆర్టీసీ బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా రాజ్ భవన్ తెలిపింది. ఈ మేరకు  రాజ్ భవన్ ఇవాళ  ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఆర్టీసీ ఉద్యోగులను  ప్రభుత్వంలో విలీనం చేయాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు  ఈ ఏడాది జూలై  31న  తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది.ఈ తీర్మానం మేరకు బిల్లును గవర్నర్ కు పంపింది  కేసీఆర్ సర్కార్. గవర్నర్ ఆమోదం పొందితే  ఈ బిల్లును  అసెంబ్లీలో పెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది.  అయితే  ఇవాళ మధ్యాహ్నం వరకు  ఈ బిల్లుపై  రాజ్ భవన్ నుండి  ఆమోదం రాలేదు. ఈ విషయమై  ఏం చేయాలని ప్రభుత్వం తర్జన భర్జన పడింది.  ఈ విషయమై  రాజ్ భవన్  శుక్రవారంనాడు మధ్యాహ్నం  స్పందించింది.  

నిన్న సాయంత్రమే టీఎస్‌ఆర్టీసీ బిల్లు తమకు పంపారన్నారు. బిల్లులు ఆమోదించలేదని  ప్రచారం తగదని గవర్నర్ తెలిపారు.న్యాయపరమైన  అంశాలు పరిశీలించాకే బిల్లుపై గవర్నర్  నిర్ణయం తీసుకుంటారని ఆ నోట్ తెలిపింది.గవర్నర్  టూర్ లో ఉన్నారని  ఆ నోట్ తెలిపింది.  ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం బిల్లు తమకు అందిందని  రాజ్ భవన్ ప్రెస్ సెక్రటరీ  తెలిపారు. ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న  గవర్నర్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టుగా  ఆ ప్రకటన తెలిపింది. 

also read:తెలంగాణ ఆర్టీసీ బిల్లు: తమిళిసై నుండి రాని ఆమోదం, కేసీఆర్ సర్కార్ తర్జనభర్జన

టీఎస్ఆర్టీసీ బిల్లు అంశంతో మరోసారి రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ కొనసాగుతుందని మరోసారి తేలింది.  గత కొంతకాలంగా  కేసీఆర్, తమిళిసై సౌందరరాజన్ మధ్య  సఖ్యత లేదు.  గవర్నర్ వ్యవహరశైలిపై  మంత్రులు  విమర్శలు  చేశారు.  తనపై  మంత్రులు  చేసిన విమర్శలపై  గవర్నర్ కూడ అదే స్థాయిలో  కౌంటరిస్తున్నారు. గత నెల  31న  గవర్నర్ నుద్దేశించి  మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.ఈ విమర్శలకు  గవర్నర్ అదే స్థాయిలో కౌంటర్ చేశారు.  బిల్లులు ఎందుకు  తిప్పి పంపామో వివరణ కూడ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాను  ఎవరికీ వ్యతిరేకం కాదని  ఆమె స్పష్టం  చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ఉన్న 43వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా  ప్రభుత్వం బిల్లును తయారు చేసి  గవర్నర్ ఆమోదం కోసం పంపారు.  అయితే  గవర్నర్  ప్రస్తుతం  హైద్రాబాద్ లో లేరని రాజ్ భవన్ వర్గాలు  ప్రకటించాయి.  గవర్నర్  వచ్చిన తర్వాత ఈ విషయమై  నిర్ణయం తీసుకోనున్నట్టుగా రాజ్ భవన్ తెలిపింది.  టీఎస్ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోతే  ఆందోళన చేస్తామని  టీఎంయూ  నేత  థామస్ రెడ్డి  హెచ్చరించారు.  

 
 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.