తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ను విడుదల చేసింది తెలంగాణ సర్కార్.
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ను శుక్రవారం నాడు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఉన్నత విద్యామండలి.
ఈ నెల 28న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. మార్చి 3 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎంసెట్ ధరఖాస్తుల స్వీకరణకు గడువు విధించారు. ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు ఎంసెట్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుండి ఎంసెట్ హల్ టిక్కెట్లు జారీ చేయనున్నారు. ఈ ఏడాది మే మాసంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మే 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ పరీక్షలను మే 12 నుండి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
హైద్రాబాద్ జెఎన్‌టీయూ ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్ధులకు ప్రవేశం కోసం పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐఐటీ జేఇఇ ప్రవేశ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే.