హైద్రాబాద్ మెట్రో ఫేజ్ -2 తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది: రాజ్యసభలో కేంద్రం

By narsimha lodeFirst Published Dec 19, 2022, 8:01 PM IST
Highlights

హైద్రాబాద్ మెట్రో ఫేజ్-2 ను తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టిందని  కేంద్ర మంత్రి  కౌశల్ కిషోర్ చెప్పారు.  బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు  కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

హైదరాబాద్:హైద్రాబాద్ మెట్రో ఫేజ్-2 ను తెలంగాణ ప్రభుత్వం మొదలు పెడుతుందని  కేంద్ర ప్రభుత్వం తెలిపింది.రాజ్యసభలో  బీజేపీ ఎంపీ  డాక్టర్ లక్ష్మణ్   అడిగిన ప్రశ్నకు  కేంద్ర మంత్రి  కౌశల్  కిషోర్  రాతపూర్వకంగా  సమాధానమిచ్చారు. ఎయిర్ పోర్టుతో పాటు  ఎంఎంటీఎస్ స్టేషన్లకు కూడా  మెట్రో రైల్ కలుపుతుందని కేంద్ర మంత్రి  వివరించారు.వరంగల్ నియో మెట్రో కింద రూ. 998 కోట్లతో 15.5 కి.మీ ప్రపోజల్ వచ్చిందని  కేంద్ర మంత్రి తెలిపారు.మార్పులతో  మరోసారి  ప్రతిపాదనలను పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినా  కూడా  ఇంతవరకు  స్పందన రాలేదని  కేంద్ర మంత్రి వివరించారు.కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలను  రాలేదని  మంత్రి వివరించారు.ఈ నెల 9వ తేదీన  హైద్రబాద్  మెట్రో రెండో ఫేజ్  కు  తెలంగాణ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు  31 కి.మీ  రూ. 6,250 కోట్లతో ఈ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

also read:హైద్రాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా మార్చాం: తెలంగాణ సీఎం కేసీఆర్

31నిమిషాల్లో  రాయదుర్గం శంషాబాద్ వరకు  ప్రయాణం చేసేలా  ఈ మెట్రోను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ విమాశ్రయానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా  చేరుకునేందుకు గాను  ఈ రైలు మార్గం  వీలు కల్పించనుంది. మూడేళ్లలో ఈ మెట్రో రైలు మార్గాన్ని  పూర్తి చేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  మెట్రో రైలు సెకండ్ ఫేజ్ విషయమై  కేంద్రం నిర్ణయం తీసుకోని కారణంగా  తామే ఈ  పనులను చేపట్టాలని  నిర్ణయం తీసుకున్నామని  తెలంగాణ ప్రభుత్వం  ప్రకటించిన విషయం తెలిసిందే.

మెట్రో ఫస్ట్ ఫేజ్ లో  ప్రస్తుతం  మూడు కారిడార్లను నిర్మించారు.  మెట్రో ద్వారా ప్రతి రోజూ నాలుగు లక్షల మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు.   రాయదుర్గం శంషాబాద్ మార్గంలో  మెట్రో రైలు మార్గం పూర్తైతే  ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది.

click me!