పార్టీలో కోవర్టిజం ఎవరూ చేసినా తప్పే: మాజీ మంత్రి శ్రీధర్ బాబు

By narsimha lodeFirst Published Dec 19, 2022, 7:00 PM IST
Highlights

పార్టీ నేతల మధ్య సమస్యలు వస్తే  ఎఐసీసీ సన్వయం చేయాలని మాజీ మంత్రి శ్రీధర్ బాబు కోరారు.  పార్టీని దెబ్బతీసేందుకు  ఎవరూ  పనిచేసినా తప్పేనని ఆయన చెప్పారు. 
 


హైదరాబాద్: పార్టీలో కోవర్టిజం ఎవరు చేసినా తప్పేనని మాజీ మంత్రి  శ్రీధర్ బాబు  చెప్పారు.సోమవారంనాడు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు.  పార్టీలో ఉండి సీనియర్లను కోవర్టులనడం తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో సమస్య వస్తే ఎఐసీసీ సమన్వయం  చేయాలన్నారు. తప్పొప్పులు బయటకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.పోలీసులు తమ మధ్య అంతర్గత కలహలు పెట్టడం సరికాదన్నారు.పార్టీ కోసం ఎవరేం చేశారో ఎఐసీసీ పిలిచి అడుగుతుందేమోనని ఆయన  చెప్పారు. 

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై  మాజీ పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయాలని  ఆయన సూచించారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే పోలీసులు విచారణ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆధారాలు లేకుండా సీనియర్లను కోవర్టులు అనడం సరైంది కాదన్నారు. సీనియర్లు కోవర్ట్ గిరి చేసినా తప్పేనని ఆయన  చెప్పారు.పీసీసీ, సీఎల్పీ నాయకుల తీరును ఎఐసీసీ గమనిస్తుందన్నారు.భట్టి విక్రమార్క నివాసంలో  బ్రేక్ ఫాస్ట్ మీటింగ్  కు తనను కూడా పిలిచారని ఆయన చెప్పారు.తాను బిజీగా ఉన్నందున భట్టి ఇంట్లో సమావేశానికి వెళ్లలేదని శ్రీధర్ బాబు తెలిపారు. 

also read:టీ కాంగ్రెస్‌లో పరిణామాలపై హైకమాండ్ ఫోకస్.. రేపటి సీనియర్ల భేటీపై ఉత్కంఠ..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  పీసీసీ కమిటీలు చిచ్చు రేపాయి.  ఈ కమిటీలో పార్టీలో  మొదటి నుండి  ఉన్నవారికి ప్రాతినిథ్యం దక్కలేదని  సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల నుండి ప్రధానంగా టీడీపీని వీడి  కాంగ్రెస్ పార్టీలో  చేరిన వలసవాదులకు  కమిటీల్లో పెద్ద పీట వేశారని  సీనియర్లు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. పార్టీ కోసం ఇంతకాలం కష్టపడిన వారికి కమిటీల్లో చోటు లేదని చెబుతున్నారు.

ఈ కమిటీల నియామకం విషయమై  తనకు  సమాచారం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా చెప్పారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో ఈ నెల  12న పార్టీ సీనియర్లు కొందరు సమావేశమయ్యారు.  టీపీసీసీ కమిటీలపై చర్చించారు.  ఈ విషయమై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17న పార్టీ సీనియర్లు మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  కీలకాంశాలపై చర్చించారు. రేవంత్ రెడ్డి తీరుపై  సీనియర్లు భగ్గుమన్నారు.  రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.రేపు మరోసారి సీనియర్లు ఆ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డి నివాసంలో సమావేశం కానున్నారు.  నిన్న జరిగిన  పీసీసీ ఎగ్జిక్యూటివ్  సమావేశానికి సీనియర్లు డుమ్మా కొట్టారు.  


 

click me!