దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: తేల్చేసిన సిర్పూర్కర్ కమిషన్

By narsimha lodeFirst Published May 20, 2022, 1:33 PM IST
Highlights

దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ ఎన్ కౌంటర్ పై క్షేత్రస్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేసిన కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదికను అందించింది. 


హైదరాబాద్: Disha Accused Encounter బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ రిపోర్టును ఈ ఏడాది జనవరి మాసంలో  సుప్రీంకోర్టుకు Sirpurkar Commission తన నివేదికను అందించింది. ఈ కమిషన్  రిపోర్టు ఆధారంగా శుక్రవారం నాడు Supreme Court విచారణ నిర్వహించింది. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పౌరహక్కుల సంఘం నేతలు సుప్రీంకోర్టులో అప్పట్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సిర్పూర్కర్ కమిషన్ ను  సుప్రీంకోర్టు  ఏర్పాటు చేసింది. ఈ ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసిందని పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది కృష్ణ చెప్పారు. ఈ రిపోర్టు సారాంశం మాత్రం తమకు కోర్టులో చదివి విన్పించారన్నారు.

ఈ రిపోర్టు కాపీలను అందరికీ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్ కౌంటర్ లేకపోతే కేసును సుప్రీంకోర్టు ఇక్కడే ముగించేదని న్యాయవాది కృష్ణ చెప్పారు. అయితే బూటకపు ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. తెలంగాణ హైకోర్టులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై విచారణ జరుగుతుందని న్యాయవాది చెప్పారు. 

ఇదిలా ఉంటే దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఏమైనా అభ్యంతరాలు ుంటే హైకోర్టు ముందుంచాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. 

also read:దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు: తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిర్ప్కూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఇవాళ విచారణను ప్రారంభించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను ఎందుకు బహిర్గతపర్చవద్దని కూడా ధర్మాసనంలో మరో జడ్జి హిమా కోహ్లి ప్రశ్నించారు. అందరికీ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఏం చెప్పిందంటే....

దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని 387 పేజీలతో సిర్పూర్కర్ కమిషన నివేదికను ఇచ్చింది. నిందితులను కావాలనే ఎన్ కౌంటర్ చేశారు.పోలీస్ మ్యాన్యువల్ కు విరుద్దంగా విచారణ నిర్వహించారని కూడా కమిషన్ అభిప్రాయపడింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారనే విషయాన్ని పోలీసులు దాచి పెట్టారని కూడా కమిషన్ ఆక్షేపించింది.ఈ ఎన్ కౌంటర్ లో పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పడం కూడా కట్టుకథేనని కమిషన్ ప్పష్టం చేసింది.ఇవి మూక దాడుల వంటివేనని కూడా సిర్పూర్కర్ కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 10 మంది పోలీసు అధికారులపై చర్యలపై హత్య కేసు నమోదు చేయాలని కూడా కమిషన్ సిఫారసు చేశారు.10 మంది పోలీస్ అధికారులు ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారని కమిషన్ తెలిపింది. 

పోలీసు అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్ లాల్ మదర్, సిరాజుద్దీన్, రవి,వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీరామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ లపై విచారణ జరపాలని కూడా సిర్పూర్కర్ కమిషన్ సూచించింది. అంతేకాదు  ఈ పోలీసు అధికారులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద విచారణ జరపాలని కమిషన్ కోరింది.

తమకు కూడా పోలీసులు కట్టుకథలే చెప్పారని కూడా సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. చట్టపరమైన పోలీస్ మాన్యువల్ రూల్స్ అతిక్రమించారని కమిషన్ తెలిపింది. దిశ నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్దమని కమిషన్ తేల్చి చెప్పింది. కావాలనే పోలీసులు నిందితులను కాల్చి చంపారని కూడా కమిషన్ అభిప్రాయపడింది. ఎన్ కౌంటర్ స్థలంలో సీసీటీవీ పుటేజీ లేకుండా పోలీసులు చేశారని కూడా కమిషన్ స్పష్టం చేసింది.  నిందితులు ఎదురు కాల్పుల్లో చనిపోయారని పోలీసులు చెప్పిన వాదన నమ్మశక్యంగా లేదని కూడా కమిషన్ అభిప్రాయపడింది. 

 

click me!