తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటేటా పెరిగిపోతున్నాయని కేంద్రం తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.33 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుండి అప్పులు గణనీయంగా పెరిగినట్టుగా కేంద్రం వివరించింది. తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో రూ. 75.577 కోట్ల అప్పు ఉండేది. అయితే ఈ అప్పు 2021-22 నాటికి రూ.2.83 లక్షల కోట్లకు అప్పులు చేరినట్టుగా కేంద్రం వివరించింది. 2022 అక్టోబర్ నాటికి ఈ అప్పులు రూ. 4.33 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఈ సమాధానంలో కేంద్రం తెలిపింది.
undefined
తమ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ వేదికగా సమర్ధించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ పై విపక్షాల సందేహలకు హరీష్ రావు సమాధానమిచ్చిన సమయంలో అప్పలు గురించి హరీష్ రావు ప్రస్తావించారు.
తమ ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఉత్పాదక రంగాల కోసం ఖర్చు చేస్తున్నామని హరీష్ రావు గుర్తు చేశారు. కాళేశ్వరం వంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు. ఈ అప్పులు రాష్ట్ర అభివృద్దికి ఉపయోగపడుతున్నాయని హరీష్ రావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తెచ్చిన అప్పులను రోజువారీ ఖర్చులకు ఉపయోగిస్తుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంమ చేసిన అప్పులను రాష్ట్రంలో ఉత్పాదక రంగంపై ఖర్చు చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుందని మంత్రి హరీష్ రావు వివరించారు. రాష్ట్రంలో ఉత్పాదక రంగం అభివృద్ది చెందితే ప్రజలకు ప్రయోజనమని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.