తమిళిసై లేఖ: మహిళా ప్రజాప్రతినిధుల బంధువుల పెత్తనంపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

Published : Aug 19, 2020, 11:26 AM IST
తమిళిసై లేఖ: మహిళా ప్రజాప్రతినిధుల బంధువుల పెత్తనంపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

సారాంశం

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కొరకరానికొయ్య మాదిరిగా తయారయ్యారు. మహిళా ప్రజా ప్రతినిధుల భర్తల పెత్తనంపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది.


హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కొరకరానికొయ్య మాదిరిగా తయారయ్యారు. మహిళా ప్రజా ప్రతినిధుల భర్తల పెత్తనంపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

తెలంగాణ రాష్ట్రంలోని పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్న చోట వారి భర్తలు, బంధువులు పెత్తనం చెలాయిస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై తమిళిసై కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

గవర్నర్ లేఖపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్న చోట  భర్తలు, బంధువులు పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అధికారిక కార్యక్రమాలు, సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా చూడాలని పంచాయితీరాజ్ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తమిళిసై అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్