వర్షానికి కూలిన ఇల్లు.. ముగ్గురు మృతి

Published : Aug 19, 2020, 10:31 AM IST
వర్షానికి కూలిన ఇల్లు.. ముగ్గురు మృతి

సారాంశం

కాగా.. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వారి ఇంటి పై మిద్దె కుప్పకూలింది. దీంతో.. తల్లీకూతుళ్లు ముగ్గురు.. కన్నుమూశారు.గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ వర్షానికి ఓ కుటుంబం బలయ్యింది. ఇంటి మిద్దె కూలి పడి ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పగిడ్యాల గ్రామానికి చెందిన శరణమ్మ.. ఆమె కూతుళ్లు వైశాలి(14), భవాని(12) ఓ మట్టి ఇంటి లో నివసిస్తున్నారు. కాగా.. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వారి ఇంటి పై మిద్దె కుప్పకూలింది. దీంతో.. తల్లీకూతుళ్లు ముగ్గురు.. కన్నుమూశారు.గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

 సంఘటన స్దలాన్ని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ పరిశీలించారు. అధికారులు విచారణ చేపట్టారు.  భర్త మల్లప్ప ఆరుబయట పడుకోవడంతో ఈ ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్నాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం షాద్‌ నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్