తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్‌టీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది. రాష్ట్రంలోని 5,089 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్:తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్‌టీకి నోటిఫికేషన్ ను శుక్రవారంనాడు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణలో 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20 నుండి అక్టోబర్ 21 వరకు టీఆర్ టీ ప్రవేశ పరీక్షల కోసం ధరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 20 నుండి 30 వరకు ఆన్ లైన్ లో టీఆర్ టీ పరీక్షలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని హైద్రాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లలో ఆన్ లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్‌సీ) ల ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ పరీక్షలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 ఏళ్లుగా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.ధరఖాస్తు ఫీజును రూ. 1000లుగా నిర్ణయించారు. పూర్తి వివరాలను https://schooledu.telangana.gov.in/isms పోర్టల్ లో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.టీచర్ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
also read:మెగా డీఎస్‌సీ కోరుతూ టీఆర్‌టీ అభ్యర్థుల ఆందోళన: హైద్రాబాద్ లో ఉద్రిక్తత
ఎస్‌జీటీ పోస్టులను డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5,089 టీచర్ పోస్టులను డీఎస్‌సీ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో 2,575 ఎస్‌జీటీ , 1739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పిస్తూ 2018లోనే ఎన్‌సీటీఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక టీచర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 10 మంది దివ్యాంగ విద్యార్థులకు ఒక స్పెషల్ టీచర్ ను నియమించనున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భర్తీ చేయనున్న టీచర్ పోస్టుల వివరాలు(ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ కలిపి)
హైదరాబాద్-358
ఆసిఫాబాద్-289
హన్మకొండ-54
ఆదిలాబాద్-275
భద్రాద్రి-185
జనగాం-76
జగిత్యాల-148
జోగులాంబ-146
కామారెడ్డి-200
ఖమ్మం-195
కరీంనగర్-99
ఖమ్మం-195
మహబూబ్ నగర్-96
మంచిర్యాల-113
మహబూబాబాద్-125
మెదక్-147
మేడ్చల్-78
నాగర్ కర్నూల్-114
నల్గొండ-219
ములుగు-65
నారాయణపేట-154
నిర్మల్-115
నిజామాబాద్-309
రంగారెడ్డి-103
పెద్దపల్లి-43
సంగారెడ్డి-196
సిద్దిపేట-141
వరంగల్-138
యాదాద్రి-99
వనపర్తి-76
వికారాబాద్-191
సూర్యాపేట-185