తమ్మినేని కృష్ణయ్య హత్య ఎఫెక్ట్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి భద్రత పెంపు

By narsimha lodeFirst Published Aug 18, 2022, 1:07 PM IST
Highlights

తమ్మినేని కృష్ణయ్య హత్య నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 1+1 గన్ మెన్లను కేటాయించింది ప్రభుత్వం.
 

హైదరాబాద్:సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి భద్రతను పెంచింది ప్రభుత్వం. ఈ నెల 15వ తేదీన తెల్దార్ పల్లిలో తమ్మినేని కృష్ణయ్య  హత్య నేపథ్యంలో తమ్మినేని వీరభద్రానికి భద్రతను పెంచింది ప్రభుత్వం. తమ్మినేని వీరభద్రానికి 1+1 గన్ మెన్లను కేటాయించింది. 

తమ్మినేని వీరభద్రం బాబాయ్ కొడుకు తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్ధులు హత్య చేశారు. సీపీఎం నేతలే ఈ హత్య చేశారని ప్రత్యక్ష సాక్షి ముత్తేశం చెప్పారు.ఈ హత్య వెనుక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు ఉన్నాడని  మృతుడు తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

తమ్మినేని  కృష్ణయ్య హత్య కేసుకు సంబంధించి రాజమండ్రిలో ఉన్న 11 మంది నిందితులను కమ్మం పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.  అయితే ఈ కేసులో ఏ 1 గా తమ్మినేని కోటేశ్వరరావు ఇంకా పోలీసులకు దొరకలేదు. తమ్మినేని కోటేశ్వరరావు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

also read:తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య: 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

సుదీర్థకాలం పాటు సీపీఎంలో ఉన్న తమ్మినేని కృష్ణయ్య మూడేళ్ల క్రితం సీపీఎం ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఈ గ్రామంలో సీపీఎం, టీఆర్ఎస్ మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఈ ఆధిపత్య పోరులో భాగంగానే తమ్మినేని కృష్ణయ్య హత్య చోటు చేసుకొందని చెబుతున్నారు. 

తమ్మినేని కృష్ణయ్యకు వస్తున్న మంచిపేరును తట్టుకోలేక రెండు దఫాలు ఆయనను సీపీఎం నుండి సస్పెండ్ చేశారని కృష్ణయ్య కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ఎంపీటీసీ ఇండిపెండెంట్ గా విజయం  సాధించామన్నారు.  ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. తమ్మినేని కృష్ణయ్య మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడుగా ఉన్నారు.  గ్రామంలో సీపీఎం, టీఆర్ఎస్ మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. దీంతో తమ్మినేని కృష్ణయ్యను సీపీఎం వర్గీయులు హత్య చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. తమ్మినేని కోటేశ్వరరావుదే ఈ హత్య వెనుక ప్రధాన హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ హత్య జరిగిన తర్వాత నిందితులు గ్రామం విడిచి పారిపోయారు. తొలుత నిందితులు మహబూబాబాదో్ సీపీఎం ఆఫీస్ కు వెళ్లి అక్కడి నుండి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిపోయినట్టుగా ప్రచారం సాగుతుంది. రాజమండ్రిలో ఉన్న 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

click me!