ఈ నిబంధనలు పాటిస్తేనే అనుమతి: పొరుగు రాష్ట్రాల వారికి తెలంగాణ సర్కార్ గైడ్‌లైన్స్

By Siva KodatiFirst Published May 13, 2021, 10:06 PM IST
Highlights

తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా రోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. తెలంగాణలోని ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరిగా వుండాలని ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా రోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. తెలంగాణలోని ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరిగా వుండాలని ఉత్తర్వులు జారీ చేసింది.  కోవిడ్ పేషెంట్ల అడ్మిషన్ కంటే ముందే ఆసుపత్రి అనుమతి అవసరమని తెలిపింది.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లకి ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 040- 2465119, 9494438351 నెంబర్లకు ఫోన్ చేయాలని స్పష్టం చేసింది. అంబులెన్స్ లేదా వాహనాలకు సైతం ముందస్తు అనుమతి తప్పనిసరని పేర్కొంది.

Also Read:హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, అంబులెన్స్‌లు ఆపొద్దు: కేసీఆర్ సర్కార్‌కి హైకోర్టు ఆదేశం

ఆసుపత్రులతో టై అప్ లేకుంటే పేషెంట్లకు విలువైన సమయం వృథా అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తిరగడం వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎపిడమిక్ యాక్ట్ ద్వారా గైడ్ లైన్స్ విడుదల చేశామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వ కంట్రోల్ రూమ్‌కు ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పేషెంట్లకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశించింది. కంట్రోల్ రూమ్ నుంచే పేషెంట్లకు పాస్‌లు మంజూరు చేస్తామని వెల్లడించింది. 

click me!