తెలంగాణ: గాంధీలో ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు.. వైద్య ఆరోగ్యశాఖ క్లారిటీ

By Siva KodatiFirst Published May 13, 2021, 8:20 PM IST
Highlights

తెలంగాణలోకి బ్లాక్ ఫంగస్ ప్రవేశించిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి రమేశ్ రెడ్డి వివరణ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదని స్పష్టం చేశారు

తెలంగాణలోకి బ్లాక్ ఫంగస్ ప్రవేశించిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి రమేశ్ రెడ్డి వివరణ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదని స్పష్టం చేశారు.

హైడోస్ స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కొందరిలో ఇది వచ్చే అవకాశం వుందని రమేశ్ రెడ్డి తెలిపారు. బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళన వద్దని ఆయన సూచించారు. గాంధీ ఆసుపత్రిలో 7 బ్లాక్ ఫంగస్ కేసులు లేవని రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చిన 3 కేసులు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. 

కాగా, బ్లాక్ ఫంగస్ వార్తలు నిర్మల్‌ జిల్లాను హడలెత్తిస్తున్నాయి. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫంగస్ లక్షణాలతో ఉన్న పలువురికి అధికారులు వైద్యం అందిస్తున్నారు. భైంసా డివిజన్‌లో మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు అయినట్లుగా సమాచారం. 

Also Read:తెలంగాణ: కొత్తగా 4,693 కరోనా కేసులు, 33 మరణాలు... జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న తీవ్రత

మరోవైపు తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 71,221 నమూనాలను పరీక్షించగా.. 4,693 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది.

తాజాగా కోవిడ్ వల్ల 33 మంది ప్రాణాలు కోల్పోగా నేటి వరకు మొత్తం మృతుల సంఖ్య 2,863కి పెరిగింది. ఈరోజు 6,876 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని వివిధ ఆసుపత్రుల్లో 56,917 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి

click me!