
హైదరాబాద్: Asha వర్కర్లకు 30 శాతం Incentiveను పెంచుతూ గురువారం నాడు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరక ఇవాళ జీవో జారీ చేసింది.ఆశా వర్కర్లకు నెలవారీ ప్రోత్సాహకాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
ఆశా వర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలను నెలకు రూ. 7500 నుండి రూ. 9500కి పెరగనున్నాయి. అయితే నేషనల్ హెల్త్ మిషన్ , ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఈ ఏడాది జూన్ నుండి పెంచిన ఇన్సెంటివ్‌లు వర్తిస్తాయని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది.
తమ వేతనాలు పెంచాలని ఆశా వర్కర్లు గతంలో ఆందోళన చేశారు. కోవిడ్ సమయంలో వైద్యులతో సమానంగా ఆశా వర్కర్లు కూడా సేవలందించారు. రోజుకు 8 గంటలకు పైగా ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. కరోనా సమయంలో ఆశా వర్కర్లు విశేషమైన కృషిని చేశారు. ఈ సమయంలో ఆశా వర్కర్ల పనితీరును పలువురు అభినందించారు.
తమకు ఉన్న పని బారం ఎక్కువ అవుతున్నా జీతాలు పెరగడం లేదని ఆశా వర్కర్లు గతంలో ఆందోళన చేశారు. తమకు కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని కూడా ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. దీంతో పాటు టీఏ, డీఏలు కూడా ఇవ్వాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇన్సెంటివ్ తో ఆశా వర్కర్లకు కొంత ఉఫశమనం లభించే అవకాశం ఉంది.