స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన.. విధివిధానాలకు ఖరారు చేసిన తెలంగాణ సర్కార్..

By team teluguFirst Published Dec 6, 2021, 1:04 PM IST
Highlights

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు (Government employees) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తెలంగాణలో స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించింది. 

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు (Government employees) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తెలంగాణలో స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జోనల్ విధానానికి (new zonal system )అనుగుణంగా ఉద్యోగాల విభజన చేపట్టనున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపింది. జిల్లా స్థాయి పోస్ట్‌లకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో  కమిటీ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా మల్టీ జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో  కమిటీ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ చేపట్టనున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అనంతరం ప్రక్రియ చేపట్టనున్నట్టుగా పేర్కొంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ఐచ్చికాలను తీసుకోనుంది. సీనియారిటీ ప్రతిపాదికన ఉద్యోగుల విభజన చేపట్టనుంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన జరగనుంది. 70 శాతానికిపైగా సమస్య ఉన్న దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వనుంది. పిల్లల్లో మానసిక దివ్యాంగులు ఉన్నవారికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వితంతులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి విభజన ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

ఇక, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజన ప్రకియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,  జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌లతో.. ఆదివారం టీఎన్జీవో, టీజీవో నేతలతో సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీజీవో అధ్యక్షురాలు మమత.. నెలలోపే ఉద్యోగుల ఐచ్చికాల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. బదిలీ ఆప్షన్ల ప్రక్రియ ఆఫ్‌లైన్ విధానంలో ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్.. ఉద్యోగుల విభజన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను నేడు విడుదల చేసింది. 

click me!