గ్రామపంచాయితీలకు కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
న్యూఢిల్లీ: గ్రామపంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.గురువారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించిందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్ల రూపాయాల నిధులను అందించిందని ఆయన చెప్పారు. కానీ కేంద్రం నుండి ఒక్క పైసా కూడా రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు.
పెట్రోల్, డీజీల్ రేట్లు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెట్రోల్, డీజీల్ రేట్లపై వ్యాట్ విధించారని ఆయన చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్, డీజీల్ ధరలున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ లీడర్లు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించాలని కోరితే కొన్ని రాష్ట్రాలు పన్నులను తగ్గించిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం పన్నులు తగ్గించలేదన్నారు.అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే పెట్రోల్, డీజీల్ ధరలున్నాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఆయిల్ ఫాం సాగును కేంద్రం ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు.
తమకు నాయకత్వ సమస్య లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే తమ పార్టీకి అభ్యర్ధులను ఇస్తారని ఆయన చెప్పారు. తెలంగాణలో నియంత పాలన సాగుతుందన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న టీమ్ తోనే ఎన్నికలకు వెళ్తామని ఆయన చెప్పారు.