కోర్టు ఆదేశాల మేరకే: ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ సర్కార్ స్పష్టత

By narsimha lodeFirst Published Jul 22, 2021, 5:04 PM IST
Highlights

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను కోర్టు ఆదేశాల మేరకే పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 15 రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

హైదరాబాద్: కోర్టు ఆదేశాల మేరకే ఎల్ఆర్ఎస్ పై నిర్ణయం తీసుకొంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది. 15 రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేయాలని మాత్రమే ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆ ప్రకటనలో ప్రభుత్వం వివరించింది. 

ఎల్ఆర్ఎస్ ధరఖాస్తుల ఆమోదంపై మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని  ప్రభుత్వం తెలిపింది. 15 రోజుల్లో ఎల్ఆర్ఎస్ కు ఆమోదమనేది తప్పుడు ప్రచారమని ప్రభుత్వం తెలిపింది. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత అనుమతులు ఇస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.  నిబంధనలు ఉల్లంఘించిన  ప్లాట్స్ ను రెగ్యులరైజ్ చేయబోమని ప్రభుత్వం తెలిపింది.

ఎల్ఆర్ఎస్ ఫీజును గతంలో ప్రభుత్వం తగ్గించింది. దుబ్బాక , జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. దీంతో ఎల్ఆర్ఎస్ పై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకొంటామని ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొన్ని స్థానాలు కోల్పోవడానికి ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు ఎల్ఆర్ఎస్ లింకు చేయడం కూడ ఓ కారణమనే అభిప్రాయాలు కూడ అప్పట్లో వ్యక్తమయ్యాయి 

 

click me!