కేటీఆర్ కు అద్భుతమైన భర్త్ డే గిఫ్ట్... మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటన

By Arun Kumar PFirst Published Jul 22, 2021, 4:11 PM IST
Highlights

శనివారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అద్భుతమైన బహుమతి అందించడానికి మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి నిర్ణయించారు. 

నిజామాబాద్: జూన్ 24వ తేదీన అంటే వచ్చే శనివారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు అధ్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలని రోడ్లు-భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిర్ణయించారు. జూన్ 24వ తేదీన తన నియోజకవర్గం బాల్కొండలో 3లక్షల 40 వేలు మొక్కలు నాటనున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మొక్కలు నాటాలని మంత్రి కోరారు. 

''మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో 3,40,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీన ఉదయం 10 నుండి 11 గంటల వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. బృహత్ పల్లె ప్రకృతి వనం మరియు బృహత్ పట్టణ ప్రకృతి వనంలో భాగంగా 8 మండల కేంద్రాలలో ఒక్కో మండలానికి 30,000 చొప్పున మొత్తం 2,40,000 మొక్కలు నాటాలి'' అని మంత్రి ఆదేశించారు. 

read more  #GiftASmile: కేటీఆర్ ఉదారత... తన పుట్టినరోజున దివ్యాంగులకు అదిరిపోయే గిప్ట్

''ఇక గ్రామాల్లోని నర్సరీలలో పెంచిన మొక్కలను ఆయా గ్రామాల్లో నాటనున్నాం. గ్రామానికి సరాసరి 1000 మొక్కల చొప్పున 100 గ్రామాల్లో 1,00,000 మొక్కలు నాటాలి. ఈ కార్యక్రమంలో  ఆయా గ్రామాల ప్రజలు, సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిపిలె, జడ్పిటిసిలతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఇలా ముక్కోటి వృకార్చనలో భాగంగా మొక్కలు నాటి కేటీఆర్ కు పుట్టిన రోజున బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నాను"అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 

ఈ నెల 24వ తేదీన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. గ్రీన్ ఛాలెంజ్, హరిత హారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు. 


 
 

click me!