అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని... కన్న కొడుకును కొట్టిచంపిన కసాయి తల్లి

Arun Kumar P   | Asianet News
Published : Jun 09, 2021, 09:42 AM ISTUpdated : Jun 09, 2021, 09:43 AM IST
అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని... కన్న కొడుకును కొట్టిచంపిన కసాయి తల్లి

సారాంశం

అమ్మతనానికే మచ్చలా నిలిచే విషాద సంఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

హైదరాబాద్: అక్రమ సంబంధం ముందు కడుపుతీపి ఓడిపోయింది. నవమాసాలు మోసిన కన్న కొడుకునే అతి కిరాతకంగా హతమార్చింది ఓ కసాయి తల్లి. అమ్మతనానికే మచ్చలా నిలిచే ఈ దుర్ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.  

హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంతో ప్రైవేట్ ఉద్యోగి సురేష్ భార్య, కొడుకు ఉమేష్(3) తో కలిసి నివాసముండేవాడు. అయితే కుటుంబసలహాల కారణంగా సురేష్ భార్య కొంతకాలంగా కుమారుడితో కలిసి వేరుగా వుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు భాస్కర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. 

read more  బాలిక కిడ్నాప్, సెక్స్ కోరికలు కలిగేందుకు ఇంజెక్షన్స్ చేసి.. ఎనిమిదేళ్లుగా..

అయితే తమ అక్రమ సంబంధానికి చిన్నారి ఉమేష్ అడ్డుగా వున్నాడని భావించిన తల్లి ప్రియుడితో కలిసి నిత్యం వేధించేది. మంగళవారం కూడా ఇలాగే కొడుకును కరెంట్ వైర్ తీసుకుని అతి దారుణంగా చితకబాదింది కసాయి తల్లి. అమ్మా... నొప్పిగా వుంది. వదిలేయమ్మా అని ఆ చిన్నారి ఎంత బ్రతిమాలినా ఆ తల్లి మనసు కరగలేదు. ఆపకుండా చితకబాదడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయినా అలాగే వదిలేసింది. 

అయితే సాయంత్రం అయినా బాలుడు లేవకపోవడంతో తల్లి సమీపంలోని మల్లారెడ్డి హాస్పిటల్ కి తీసుకెళ్లింది. కానీ అప్పటికే బాలుడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బాలుడి శరీరంపై గాయాలను గమనించిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు