హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీగా సుధాకర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హరికృష్ణను తప్పించి సుధాకర్ ను నియమించింది ప్రభుత్వం
హైదరాబాద్: హకీంపేల స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ సుధాకర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ పనిచేస్తున్న హరికృష్ణపై ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో సుధాకర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారంనాడు నియమించింది. మేడ్చల్ జిల్లా యువజన అధికారిగా సుధాకర్ పనిచేశారు. సుధాకర్ ను హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. స్పోర్ట్స్ స్కూల్ పరిణామాలపై తాను వ్యాఖ్యానించబోనని ఆయన చెప్పారు. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొల్పే ప్రయత్నం చేస్తానన్నారు.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో హరికృష్ణపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసిన విషయం తెలిసిందే. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై ఓఎస్‌డీ హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పుడుతున్నాడనే మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్‌డీ హరికృష్ణపై రాష్ట్ర ప్రభుత్వ సస్పెండ్ చేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హరికృష్ణ తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపించాలని హరికృష్ణ కోరారు.హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ బాధ్యతలు చేపట్టిన సుధాకర్ మీడియాతో మాట్లాడారు.
also read:వారంతా నా కూతుళ్లతో సమానం: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులపై ఓఎస్‌డీ హరికృష్ణ
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో చోటు చేసుకున్న ఘటనలపై స్పందించబోనన్నారు. విద్యార్థుల్లో మనో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నానని సుధాకర్ మీడియాకు చెప్పారు.ఇదిలా ఉంటే హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో విచారణను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమైతే బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ ఘటన వెనుక ఎంత పెద్దవారున్నా వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.