వాహనాల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును మరోసారి తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.
హైదరాబాద్: వాహనాల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును మరోసారి తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు బుధవారం నాడు రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 వ తేదీ వరకు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇప్పటికే ఒక్కసారి గడువును పొడిగించింది.ఇవాళ్టితో గడువు ముగియనుంది. దీంతో గడువును వచ్చే నెల 15వ తేదీ వరకు పెంచింది సర్కార్.
also read:గుడ్‌న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
undefined
2023 డిసెంబర్ 26వ తేదీన పెండింగ్ చలాన్లపై రాయితీని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. 2024 జనవరి 10వ తేదీన గడువును ఇచ్చింది. అయితే ఈ నెల 10వ తేదీన తొలిసారి గడువును పెంచింది. ఇవాళ్టి వరకు గడువును పొడిగించింది. అయితే ఇవాళ గడువును మరోసారి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ద్విచక్రవాహనాలు, మూడు చక్రాల వాహనాలపై 80 శాతం, కార్లపై 50 శాతం , హెవీ వెహికిల్స్ పై 60 శాతం రాయితీ ప్రకటించింది. 2022లో పెండింగ్ చలాన్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 10వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 107 కోట్ల ఆదాయం లభించింది.