కర్నూల్ ప్రమాదం: బాధితులకు తెలంగాణ సర్కార్ హామీ ఇదే

By narsimha lodeFirst Published May 12, 2019, 2:24 PM IST
Highlights

ర్నూల్ జిల్లా వెల్దుర్తి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రామాపురం గ్రామస్తులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలను చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

వడ్డేపల్లి: కర్నూల్ జిల్లా వెల్దుర్తి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రామాపురం గ్రామస్తులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలను చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో రామాపురం గ్రామంలో బాధిత కుటుంబాలు ధర్నాను  విరమించాయి.

శనివారం నాడు  వెల్దూర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం గ్రామానికి చెందిన 14 మంది మృతి చెందారు.మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూల్ ప్రభుత్వాసుపత్రి వద్ద బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి.

మరో వైపు వడ్డేపల్లిలో కూడ ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ నేతృత్వంలో బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. రెండు చోట్ల ఇదే విషయమై ఆందోళనలు సాగాయి.

మృతుల కుటుంబాలను ఆదుకొంటామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు చెల్లిస్తామని సబ్‌ కలెక్టర్ హామీ ఇచ్చారు.  అంతేకాదు మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్‌ ఇంటిని ఇస్తామన్నారు. దీనికి తోడు మృతుల పిల్లలను చదివించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. దీంతో రామాపురంలో బాధితులు ఆందోళన విరమించారు.

మరో వైపు  పోస్టుమార్టం చేసిన తర్వాత కర్నూల్  ప్రభుత్వాసుపత్రి నుండి మృతదేహాలు రామాపురం గ్రామానికి చేరుకొన్నాయి. రామాపురంలో మృతదేహాలకు సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

కర్నూల్ ప్రమాదం: ప్రభుత్వాసుపత్రి వద్ద బాధిత కుటుంబాల ధర్నా

జర్నీ సినిమానే: కర్నూల్‌ ప్రమాదంపై ప్రత్యక్షసాక్షులు

కర్నూలు రోడ్డు ప్రమాదం: కొద్దిసేపట్లో ఇంటికి చేరేవారే, మృతులు వీరే

కర్నూలు రోడ్డు ప్రమాదం: పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ 15 మందిలో ఒక్కరే మిగిలారు

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం (ఫోటోలు)

కర్నూలులో రోడ్డు ప్రమాద బీభత్సం (వీడియో)

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది మృతి

click me!