కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం: తెలంగాణ ప్రతినిధులు హాజరయ్యేనా?

By narsimha lodeFirst Published Aug 3, 2021, 10:10 AM IST
Highlights

కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం ఇవాళ జరగనుంది.ఈ సమావేశానికి ముందే పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలని  తెలంగాణ కోరింది.ఈ విషయమై జీఆర్ఎంబీ  సభ్య  కార్యదర్శికి తెలంగాణ లేఖ రాసింది. ఈ సమావేశానికి  తెలంగాణ హాజరౌతోందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.


హైదరాబాద్: జీఆర్ఎంబీ (గోదావరి నదీ యాజమాన్య బోర్డు)  సమావేశం మంగళవారంనాడు జరగనుంది. ఉమ్మడి ప్రాజెక్టులను జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే గెజిట్ ను విడుదల చేసింది.ఈ గెజిట్ విడుదలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండానే బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను ఎలా తీసుకొస్తారని తెలంగాణ ప్రభుత్వం  ప్రశ్నిస్తోంది.

గోదావరి బోర్డు సమావేశానికి ముందే పూర్తిస్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ హజరుకానుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుండగా ఆలోపు పూర్తిచేయాల్సిన కార్యాచరణపై కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం సమన్వయ కమిటీలు ఏర్పాటుచేశారు.

ఈ క్రమంలో రెండుబోర్డులు సమన్వయ కమిటీ తొలిసమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశాయి. బోర్డులకు సంబంధించిన ఉద్యోగుల నియామకం, ఆర్గనైజేషనల్‌ స్ట్రక్చర్‌పై దృష్టి పెట్టాలన్న సూచనల మేరకు కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశాలు నిర్వహించాలని జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ నిర్ణయించాయి. అయితే ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏపీ, కేంద్రప్రభుత్వాలు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని  తెలంగాణ ఆరోపిస్తోంది. హలియాలో జరిగిన సభలో  సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హలియాలో జరిగే సభలో కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని  వ్యాఖ్యానించారు.

click me!