తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 1,663 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి.. వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Jul 2, 2022, 6:03 PM IST
Highlights

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 80 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటికేషన్లు విడుదల చేసింది. తాజాగా రాష్ట్రంలో మరో 1,663 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 80 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటికేషన్లు విడుదల చేసింది. తాజాగా రాష్ట్రంలో మరో 1,663 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ పోస్టులతో కలిపితే ఇప్పటివరకు ఆర్థిక శాఖ 46,998 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చినట్టు అయింది. తాజాగా ఆర్థిక శాఖ అనుమతిచ్చిన పోస్టులో.. ఇరిగేషన్, ఆర్ డ్ం బి శాఖల్లోని 1522 పోస్టులు ఉన్నాయి. 

ఆ పోస్టుల జాబితాలో నీటి పారుదల శాఖలో..  704 ఏఈఈ పోస్టులు ,  227 ఏఈ పోస్టులు, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, భూగర్భ జలశాఖలో..  88 పోస్టులు, ఆర్ అండ్ బీలో.. 38 సివిల్ ఏఈ పోస్టులు, 145 సివిల్ ఏఈఈ పోస్టులు, 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. 

ఇక, ఇప్పటికే.. పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో పలు  ఖాళీల భర్తీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్లు కూడా వెలువడ్డాయి. ఇక, తాజాగా ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. మరోవైపు మిగిలిన పోస్టుల భర్తీకీ అనుమతుల ప్రక్రియను ఆర్థికశాఖ ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. 
 

click me!